Monday, 11 April 2016
Sunday, 10 April 2016
Wednesday, 27 January 2016
హింగిస్‌పై సానియాదే పైచేయి
మార్టినా హింగిస్‌తో పోరులో సానియామీర్జాదే పైచేయిగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా సునాయాసంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా... సహచరి మార్టినా హింగిస్-లియాండర్ పేస్ జంటను ఓడించింది. ఏకపక్షంగా సాగిన క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సానియా-డొడిగ్ జంట 7-6 (7-1), 6-1తో హింగిస్-పేస్ జోడీని ఓడించింది.
తొలి సెట్లో తప్ప సానియా ద్వయానికి హింగిస్ జంట నుంచి ప్రతిఘటన ఎదురుకాలేదు. సెమీస్‌లో సానియా-డొడిగ్ జంట వెస్నినా-సొరెస్ జోడీతో తలపడతారు. సానియా-హింగిస్ ఇప్పటికే మహిళల డబుల్స్‌లో తుది సమరానికి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

వీరమ్ రిమేక్‌లో పవర్‌స్టార్!
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో బీజీ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే ఒక కొత్త ప్రాజెక్టు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్ సినిమాను తెలుగులోకి రిమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో పవన్ నటించే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. గబ్బర్‌సింగ్ రిమేక్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన పవన్... ఈసారి కూడా రిమేక్ తీస్తేనే సేఫ్ అనుంటుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అజిత్ హీరోగా నటించిన వీరమ్ సినిమాను తెలుగులోకి తీస్తున్నారు.
ఈ సినిమాలో కథ పవన్‌కు సరిగ్గా సరిపోతుందని ఆయనైతే మరింత గొప్పగా ఆ క్యారెక్టర్‌ను చేసే అవకాశాలున్నాయని ఈ సినిమాను తెలుగు హక్కులు దక్కించుకున్న వారి మాట. వీరమ్ సినిమా కథ 90ల్లో తెలుగునాట సూపర్ హిట్ అయిన జగపతిబాబు పెద్దరికం కథను పోలి ఉంటుంది.
ఐతే బ్యాక్‌గ్రౌండ్ వేరుగా ఉంటుంది. ఇందులో నలుగురు తమ్ముళ్లకు అన్నగా అజిత్ నటించాడు. ఇప్పడు అదే పాత్ర పవన్ చేయనున్నాడు. ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్ మిళితమం అయి ఉండే ఈ కథలో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు మార్పు చేర్పులు చేస్తే సినిమా మరింత గొప్పగా వచ్చే అవకాశం ఉంటుంది.

Subscribe to:
Posts (Atom)