అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఆయన 60వ పుట్టిన రోజు కూడా స్టార్ట్ కాలేదు.
ముందుగా అనుకున్న కధలు కుదరకపోవడం, డైరెక్టర్ ఎవరో తేలకపోవడంతో ఈ సినిమా రాక మరింత లేట్ అయ్యే
అవకాశాలు కనబడుతున్నాయి. వినాయక్ లాంటి డైరెక్టర్కు ఈ సినిమా చేసే అవకాశం ఇస్తారని అనుకున్నా..
పరిస్థితి చుస్తే మంచి కధ వినిపించిన కొత్త డైరెక్టర్కు కూడా ఈ అరుదైన ఆవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. చిరు
ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఆసక్తికరం. తెలుగు చలన చిత్ర సీమలో మకుటం లేని మహా రాజుగా వెలుగు
వెలిగిన మెగా స్టార్ తన కెరీర్లో మైలురాయి లాంటి సినిమా చేయడానికి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ
సినిమాను తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తుండగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో నటించే
అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment