Wednesday, 27 January 2016

ష‌కీరా.. వాకా వాకా 100 కోట్లు

2010 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా కొలంబియా పాప్ సింగ‌ర్ ష‌కీరా రూపొందించిన వాకా..వాకా సాంగ్ ఎంత‌టి ప్రాచుర్యం పొందిందో  తెలిసిందే.  ఈ విఖ్యాత వీడియోను యూట్యూబ్‌లో 100 కోట్ల మంద వీక్షించార‌ట‌. ఈ విష‌యాన్ని ష‌కీరా ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. 

ఎంతో అభిమానంతో తాను చేసిన ఈ వీడియోను ఇన్ని కోట్ల మంది చూడ‌టం చాలా ఆనందాన్ని ఇస్తోంద‌ని ష‌కీరా పేర్కొంది. ఈ పాట త‌న  కెరీర్‌నే మార్చేసింద‌ని... ఎంతో ప్ర‌భావితం చేసింద‌ని ఆమె అమితానందాన్ని వ్య‌క్తం చేసింది.  ఈ పాట‌ను చూసి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల‌ మంది అభిమానులు ప్రేర‌ణ పొందార‌ని.. త‌న‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో అభినంద‌నలు వెల్లువెత్తాయ‌ని ఆమె ఉబ్బిత‌బ్బిబ్బయింది. ఈ పాట భావి త‌రాల వారిని ఫుట్‌బాల్ ప్రేమికులుగా మారిస్తే తాను మ‌రింత సంతోషిస్తాన‌ని ఆమె చెప్పింది. 

వాకా..వాకా పాట‌లో ష‌కీరా స్వ‌యంగా  ఆల‌పిస్తూ చేసిన డ్యాన్స్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. ఈ పాట‌కు ఎన్ఆర్‌జే మ్యూజిక్ అవార్డుతో పాటు ఎన్నో పుర‌స్క‌రాల‌ను అందుకుంది.

No comments:

Post a Comment