Wednesday, 27 January 2016

వీర‌మ్ రిమేక్‌లో ప‌వ‌ర్‌స్టార్‌!

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్  సినిమాతో బీజీ బిజీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే ఒక కొత్త ప్రాజెక్టు ఒప్పుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వీర‌మ్ సినిమాను తెలుగులోకి రిమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో ప‌వ‌న్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. గ‌బ్బ‌ర్‌సింగ్ రిమేక్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌... ఈసారి కూడా రిమేక్ తీస్తేనే సేఫ్ అనుంటుకున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో అజిత్ హీరోగా న‌టించిన వీర‌మ్ సినిమాను తెలుగులోకి తీస్తున్నారు. 

ఈ సినిమాలో క‌థ ప‌వ‌న్‌కు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ఆయ‌నైతే మ‌రింత గొప్ప‌గా ఆ క్యారెక్ట‌ర్‌ను చేసే అవ‌కాశాలున్నాయ‌ని ఈ సినిమాను తెలుగు హ‌క్కులు ద‌క్కించుకున్న వారి మాట‌. వీర‌మ్ సినిమా క‌థ  90ల్లో తెలుగునాట సూప‌ర్ హిట్ అయిన జ‌గ‌ప‌తిబాబు పెద్ద‌రికం క‌థ‌ను పోలి ఉంటుంది.  

ఐతే బ్యాక్‌గ్రౌండ్ వేరుగా ఉంటుంది.  ఇందులో న‌లుగురు త‌మ్ముళ్ల‌కు అన్న‌గా అజిత్ న‌టించాడు. ఇప్ప‌డు అదే పాత్ర ప‌వ‌న్ చేయ‌నున్నాడు.  ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్ష‌న్ మిళిత‌మం అయి ఉండే ఈ క‌థ‌లో ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు మార్పు చేర్పులు చేస్తే సినిమా మ‌రింత గొప్ప‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

No comments:

Post a Comment