Wednesday, 27 January 2016

నితిన్‌ రిస్క్ చేస్తున్నాడా?


త‌మిళ స్టార్ సూర్య న‌టిస్తున్న కొత్త చిత్రం 24.  ఇటీవ‌లే సూర్య ట్విట్ట‌ర్‌లో పెట్టిన ఈ సినిమా పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. సూర్య‌ను ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌ని గెట‌ప్‌లో ఉన్న ఆ లుక్ అభిమానుల దృష్టి తిప్పుకోనీయ‌కుండా చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానున్న సూర్య 24 సినిమా ఇప్పుడు మ‌రోసారి వార్తల్లోకి వ‌చ్చింది. దీనికి కార‌ణం టాలీవుడ్ యువ న‌టుడు నితిన్ ఈ సినిమా  తెలుగు హ‌క్కుల‌ను కొనుక్కున్నాడు. ఇటీవ‌లే అఖిల్ సినిమా హ‌క్కుల్ని కొనుగోలు చేసిన నితిన్ భారీగా న‌ష్ట‌పోయాడు. 

అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా వ‌స్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ హ‌క్కుల్ని కూడా నితినే కొన్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌ష్ట‌పోయిన నితిన్ భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్ల‌డం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఐతే ప‌వ‌న్ క‌ల్యాణ్ ,సూర్య సినిమాలు బంప‌ర్‌హిట్ అయితే  న‌ష్టాల నుంచి కోలుకోవ‌డం నితిన్‌ను పెద్ద క‌ష్టం కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. 

గ‌బ్బ‌ర్‌సింగ్‌పై భారీ న‌మ్మ‌కం ఉన్నా... సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న  త‌మిళ సినిమా 24 ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రం. ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న స‌మంత క‌థానాయ‌కిగా న‌టిస్తోంది.  ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం ఇస్తుండ‌టంతో యువ‌త దృష్టి దీనిపైనే ఉంది.  ఆల్ ది బెస్ట్ నితిన్‌...

No comments:

Post a Comment