Friday, 22 January 2016

అల్లు అర్జున్ స‌రైనోడు ప్రిలుక్ అదిరిపోయింది

అల్లు అర్జున్ కొత్త చిత్రం స‌రైనోడు ప్రిలుక్ అదిరిపోయింది. కండ‌లు తిరిగిన‌న బాడీ,  చేతిలో విచిత్ర‌మైన ఆయ‌ధంతో బ‌న్ని అద‌ర‌గొట్టాడు.  బోయ‌పాటి శ్రీ‌నివాస్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంపై అభిమానులు ఎన్నోఆశ‌లు పెట్టుకున్నారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్ ప‌తాకంపై ఈ సినిమాను నిర్శిస్తున్నారు.
 ఈ ప్రిలుక్‌లో అల్లు అర్జున్ ముఖం ఏమి క‌నిపించక‌పోయినా అత‌ని లుక్ మాత్రం చాలా మాస్‌గా  ఉంది. మాస్ సినిమాలు తీయ‌డంలో బోయ‌పాటి శైలి తెలియంది కాదు. నేప‌థ్యంలో ఈ సినిమాను కూడా బోయ‌పాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా అందిస్తార‌నేది అభిమానుల ఆశ‌. జ‌న‌వ‌రి 26న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌రస‌న ర‌కుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది, భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా త్వ‌ర‌లోనే అభిమానుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment