ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత తార సానియామీర్జా దూసుకెళుతోంది. మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు వెళ్లిన ఆమె... మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ క్వార్టర్‌పైనల్లో అడుగుపెట్టింది. స్విస్ తార మార్టినా హింగిస్ జతగా మహిళల డబుల్స్‌లో అప్రతిహత విజయాలతో ముందుకెళుతున్న సానియా.. ఆ పామ్‌ను ఆస్ట్రేలియా ఓపెన్లోనూ చూపిస్తోంది.
ఈ టోర్నీలో టాప్‌సీడ్ జోడీగా బరిలో దిగిన సానియా-మార్టినాలు డబుల్స్ క్వార్టర్‌పైనల్లో 6-2, 4-6, 6-1తో గ్రోయిన్‌ఫీల్డ్-వాండ్‌వాగె జంటను ఓడించారు. తొలి సెట్‌ను సులభంగానే గెలుచుకున్న సానియా జోడీకి రెండో సెట్లో ప్రత్యర్థుల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్ 4-6తో చేజారినా.. ప్రపంచ నెంబర్‌వన్ జంట వెనకడుగు వేయలేదు. అద్భుతంగా పుంజుకుని మూడో సెట్లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.
హింగిస్‌తో సానియా ఢీ!
మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ సానియా హవా కొనసాగుతోంది. ఆమె అలవోకగా క్వార్టర్‌ఫైనల్ చేరింది. డొడిగ్ (క్రొయేషియా) జతగా టాప్‌సీడ్‌గా బరిలో దిగిన సానియా జోడీ 7-5, 6-2తో ష్వెదొవా-ఖురేషిలపై గెలిచింది. విశేషం ఏమిటంటే సానియా జంట క్వార్టర్‌ఫైనల్లో తన పార్ట్‌నర్ మార్టినా హింగిస్‌తోనే తలపడనుంది. ఇంకో విశేషం మార్టినా లియాండర్ పేస్ జతగా బరిలో ఉండటం. ప్రిక్వార్టర్స్‌లో పేస్-మార్టినా 6-1, 6-2తో స్టిఫెన్స్-రోజర్‌లను ఓడించారు. మరి సానియా, హింగిస్ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తికరం.

No comments:
Post a Comment