Wednesday, 27 January 2016

మ‌రో టైటిల్ ముంగిట సానియా

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్లో సానియామీర్జా-మార్టినా హింగిస్‌ల‌కు ఎదురే లేకుండాపోయింది. ఈ జోడీ అల‌వోక‌గా టోర్నీ ఫైన‌ల్ చేరింది. బుధ‌వారం  మెల్‌బోర్న్‌లో జ‌రిగిన మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ జంట 6-1, 6-0తో జార్జెస్‌-ప్లిస్కొవా జోడీని చిత్తుగా ఓడించారు.  ఈ మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం లేకుండా ఆడిన సానియా జోడీ క‌ష్ట‌ప‌డ‌కుండానే తుది స‌మ‌రానికి చేరింది.  

ఫైన‌ల్లో సానియా ద్వ‌యం ఏడో సీడ్ హ్ల‌వ‌కోవా-హెడ్రెకా జంటతో అమీతుమీ తేల్చుకుంటారు. ఈ టైటిల్ కూడా సాధిస్తే  సానియా-హింగిస్‌ల‌కు ఇది వ‌రుస‌గా ఎనిమిదో టైటిల్ అవుతుంది. ఈ ఏడాది మూడో టైటి్‌ల్‌. మొత్తం మీద ప‌న్నెండో  టైటిల్ కానుంది.  మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో డొడిగ్ జ‌త‌గా ఆడుతున్న సానియా.. క్వార్ట‌ర్స్‌లో స‌హ‌చ‌రి హింగిస్‌తో పోటీకి సిద్ధ‌మైంది. సానియా-డొడిగ్ జంట  లియాండ‌ర్ పేస్‌-హింగిస్‌ల‌తో ఆడ‌నుంది.

No comments:

Post a Comment