Tuesday, 26 January 2016

ట్విటర్‌లో చేరిన క‌మ‌ల్‌హ‌స‌న్‌

విఖ్య‌త న‌టుడు క‌మ‌ల్‌హ‌స‌న్ ట్విట‌ర్ ఖాతా తెరిచాడు. దాదాపు అంద‌రు న‌టులు ట్విట‌ర్‌లో ఉండ‌గా క‌మ‌ల్ మాత్రం ఇంత‌కాలం దూరంగా ఉన్నారు. ఐతే తాజాగా ట్విట‌ర్ అకౌంట్ తెరిచి త‌న భావాల‌ను పంచుకోవాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు.  రిప‌బ్లిక్ డే రోజున క‌మ‌ల్ ట్విట‌ర్‌లో స‌భ్యుడిగా మారారు. 

క‌మ‌ల్ ట్విట‌ర్‌లో చేరిన 13 గంట‌ల్లోనే ఆయ‌న‌ను అనుస‌రించే వారి సంఖ్య 30 వేల‌కు పైగా చేరుకుంది.  ఆయ‌న కుమార్తె, సినిన‌టి శ్రుతి హ‌స‌న్ క‌మ‌ల్‌కు ట్విట‌ర్‌లోకి స్వాగ‌తం చెప్పారు.  మా నాన్న‌, తానెంతో అభిమానించే న‌టుడు ట్విట‌ర్లో చేరార‌ని శ్రుతి ట్వీట్ చేరారు.

No comments:

Post a Comment